వత్సవాయి గ్రామంలో మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, ఏప్రిల్ 14 వత్సవాయి మండలం, వత్సవాయి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత , ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, వసతులు, హాస్టల్ నిర్వహణ, భోజన నాణ్యత తదితర అంశాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి బోధన విధానం, ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించారు. హాస్టల్‌ను సందర్శించిన మంత్రి , ఎమ్మెల్యే ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకుని, ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసిన మంత్రి నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతపై దృష్టి సారించి, వాటిని శుభ్రంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం పాఠశాలకు సహకరించిన దాతలను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి వసతులు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో గురుకుల పాఠశాలల్లో బోధన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం బోధన, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచనలు ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. గురుకుల పాఠశాలలను ఆదర్శవంతమైన విద్యాసంస్థలుగా అభివృద్ధి చేయడం, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత సమర్థవంతంగా అమలు కావాలనే ఉద్దేశంతో ఈ ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *