గుడ్లనర్వలో మహాత్మ జ్యోతి రావు పూలే 200వ జయంతి ఘనంగా నిర్వహణ

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి బహుజన సంఘాల నాయకులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో మహాత్మ జ్యోతి రావు పూలే 200వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై జీవితాంతం కృషి చేసిన మహానేతకు గ్రామస్థులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, సమాజ స్థాపనలో జ్యోతి రావు పూలే చేసిన సేవలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆలోచనలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవరకొండ రామచందర్, ఉప సర్పంచ్ దాసరి శివ, లేట్ల వెంకట్, చెన్నయ్య, కొడిదల రాము, లేట్ల భీమారావు, మన్యం భీమని రాజు, లేట్ల వట్టెం మహేష్, ఉపాధ్యాయుడు పచ్చిపాల సుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, లేట్ల ఉదయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ గూడకాశన్న, బాల లక్ష్మయ్య, లేట్ల శివకృష్ణ, కే శ్రావణ్ కుమార్, ఆర్ శ్రీశైలం, కే రాజు, లేట్ల వేణు, కోడిపర్తి విజయ్ కాంత్, వట్టెం సందీప్, వట్టెం శివకృష్ణ, వట్టెం నాగేంద్రబాబు, వట్టెం విజయ్ తదితరులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *