పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మరేపల్లి శివలీల చంద్రగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే జీవిత విశేషాలను స్మరించుకున్నారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బీసీ మాలి కులంలో జన్మించిన పూలే, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప సంస్కర్తగా నిలిచారని తెలిపారు. చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ విద్యను అభ్యసించిన ఆయన, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. కులవివక్ష నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, వితంతువుల పునర్వివాహం వంటి సంస్కరణలకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ 1848లో పూణేలో తొలి మహిళా పాఠశాలను ప్రారంభించడం ద్వారా ఆయన చరిత్ర సృష్టించారని వివరించారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేను దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పూలే ఆశయాలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గడ్డం రామచంద్రయ్య, వార్డ్ సభ్యులు ముధం శివయ్య యాదవ్, గౌసియా బేగం, తిమ్మక్క, సునీత, తిరుపతయ్య, చంద్రకుమార్, జిల్లా నాయకులు మన్నెం పి జాంగిర్, ఇగురం బాధ శ్రీనివాసులు, గ్రామస్తులు రాజేందర్ గౌడ్, వెంకట్ స్వామి, వంశీ నాయక్, పంతులు జియాజీ, వంశిధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఉప్పరి శీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.