దాసు తండాలో నీటి సమస్యకు చెక్.

సర్పంచ్ మునీందర్ తక్షణ చర్య

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ చిన్న పీరు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దాసు తండాలో నెలకొన్న నీటి సమస్యను గుర్తించిన సర్పంచ్ మునీందర్ వెంటనే స్పందించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త మోటర్‌ను కొనుగోలు చేసి, వెంటనే అమర్చించారు. దీంతో తండాలోని నీటి సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ మునీందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను వెంటనే గుర్తించి స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ పీటీయా, గోవింద్, పాండు, సోమ్లా, రాజు, తావురు మరియు తండా వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *