ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలుబడుగుల ఆశాజ్యోతి పూలే ఆశయాలను కొనసాగిద్దాం!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుమాజీ ఎంపీపీ చటారి సాయి బాబా

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 12 రూలర్ ప్రతినిధి బి బాసు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జాయింట్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చటారి సాయి బాబా మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజ సంస్కర్తగా విశిష్ట స్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు. బాలికల విద్య కోసం పోరాడి, బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. కుల వివక్ష నిర్మూలనకు ఆయన చేసిన సేవలు అపారమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తిగా పూలేను గుర్తుచేస్తూ, ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. గిరిజన యువత ఆయన స్ఫూర్తితో తమ హక్కులు, చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలగంజి సోమేశ్వరరావు, పి. చిన్నస్వామి, పాంగి గంగాధర్, భాను, సిహెచ్ రావు, గంపరాయి టి. భీమారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *