గుడ్లనర్వలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా

కార్యక్రమంలో బిజినపల్లి మండల దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం అంబేద్కర్ చిత్రపటంతో గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. తదనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మండల దళిత నాయకులు పాల్గొని అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన సమాజానికి చేసిన సేవలను వివరించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు, గ్రామ యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *