పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ 90వ ఆర్భవ దినోత్సవం సందర్భంగా ఆదోని మండలం ( 1) విరుపాపురం గ్రామం నందు రైతు సంఘం పథకాన్ని గ్రామ రైతు తిక్కన్న ఘనంగా ఆవిష్కరించడం జరిగిందిఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుదర్శన్ , సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న ఉత్తర ప్రదేశ్ లక్నో లో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లో 1928 గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఏర్పడి రైతు సమస్యలపై పోరాటాలు ప్రారంభం అయ్యాయని భూమి పన్నులు పెంపు జమీందారి వ్యవస్థ అప్పులు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. రైతు పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ కంపెనీల కు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా దోపిడీ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు .కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండేందుకు విత్తనం చట్టాన్ని అమలు చేసిందని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా కార్పొరేటర్ కంపెనీలు తయారు చేసినటువంటి ఎరువులు, క్రీమ హారక మందులను తయారు చేస్తున్న.కంపెనీలకు మాత్రం అధిక ధరలు ఇస్తుందని అన్నారు 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ 10000.00 ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలి వరి క్వింటాలకు 3000.00 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి 30% శాతం నిధులు బడ్జెట్లో కేటాయించాలని కోరారు.కౌలు రైతులకు రక్షణకు ప్రత్యేక చట్టం చేయడంతో పాటు పెట్టుబడి సహాయం అందించాలి. రైతులు కౌవులు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి దేవాదాయ కౌలు రైతులకు రక్షణ కల్పించాలి వ్యవసాయం అనుబంధ రంగాలకు సబ్సిడీలు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు .పేద మధ్యతరగతి రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు 90% శాతం సబ్సిడీపై అందించాలి ప్రతి రైతుకు ఐదు లక్షల వరకు భీమా సౌకర్యం కల్పించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి 2013లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి ఉత్పత్తులను మార్కెట్ కమిటీలు ద్వారా కోనేలా చూడాలి .అభివృద్ధి పేరుతో బలవంతంగా రైతులుపేద రైతుల భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టేప్రభుత్వం నిర్మించుకోవాలని అన్నారు. రైతు సమస్యల పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విరుపాపురంగ్రామ రైతులు సుంకప్ప నరసింహులు గోపి రంగనాథు మారెప్ప ఏసోబు రాజు తదితరులు పాల్గొన్నారు.