కర్నూలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 135వ అంబేద్కర్ నీవాళులు అర్పించారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసే ఆది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ కర్నూలు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 135వ అంబేద్కర్ జయంతోత్సవాల్లో మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ , జాయింట్ కలెక్టర్ నూరల్ సోషల్ వెల్ఫేర్ డిడి రాధికా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలోనే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ రవి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామంజి, దివ్యాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప అధికారులు సంఘ నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *