
పయనించే సూర్యుడు ఏప్రిల్ 19, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) తిమ్మాపురం శిరిడి సాయిబాబా గుడి వద్ద శ్రీ సద్గురు సాయి బాబా ట్రస్ట్ వారి చలివేంద్రం జనసేన నాయకులు మాతారపు తాతాజీ ప్రారంభించిన చలివేంద్రం 19వ రోజుకి దిగ్విజయంగా ప్రతిరోజు ప్రయాణికులకు వాహందారులకు కూలింగ్ వాటర్ ప్రతి గురువారం మజ్జిగ పంచడం జరుగుతున్నది. అదే విధంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ వారి చేతుల మీదుగా అన్నదానం జరుగుచున్నది శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ అధ్యక్షులు మాట్లాడుతూ సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు మాట్లాడుతూ మా గురుదేవులు మామిడిపల్లి లక్ష్మీ రామారావు ఆశీర్వచనములతో మూడు నెలలు చలివేంద్రం జరుగుతున్నదని తెలియపరుచున్నారు అదేవిధంగా పండ్రవాడ జంక్షన్ లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి జగన్మాత సదాశివ ప్రశాంత మందిరం దగ్గర పాలింకి సత్యనారాయణ గురుభవాని ఆధ్వర్యంలో ప్రతిరోజు కూలింగ్ వాటర్ ప్రతి శుక్రవారం మజ్జిగ పంచడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ పి నాగేశ్వరరావు ఎస్సై రిటైర్డ్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ తోట తయారమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది