పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 రెంజల్: రెంజల్ మండలంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రెంజల్ ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది రెంజల్ మండల పరిధిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్ నడిపి నాగన్న మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పార్వతి రాజేశ్వర్ సమప్తంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు చేయకపోవడంతో రైతులు మధ్య ధరకోల్పోయి తక్కువ ధరకు దళారులకు అమ్ము కుంటున్నారు వరి పండించాలంటే రైతులకు యూరియా కొరత పండించిన వడ్లకు అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల కొరత మాది ప్రజా పరిపాలన అని గొప్ప గాచెప్పు కుంటున్నారు తప్ప ఏ ఏర్పాటు చేసింది ఏమీ లేదు గత వర్షాకాలంలో నీలా కందకుర్తి బోర్గం తాడి బిలోలి గ్రామాల రైతుల పంటలు నీట మునిగి నిండా మునిగినారు మన ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన నష్టపోయిన రైతులకు ఒక రూపాయి కూడా ఆర్థిక సాయం అందించలేదు వేలాది ఎకరాల పంట భూములు పంటలు నష్టపోయిన రైతుల జీనస్థితి అమ్ముకుందాము పోతే కొనబోతే కొరివి అనే చందంగా ఉన్నది రైతులు అప్పుల పాలవుతున్నాడు కనీసం మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక క్వింటాలు కు 3000 రూపాయలు వరి పంటకు ఇవ్వాలని ఇప్పటికే గ్రామాలలో వరి కోతలు సగానికి పైన అయిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంగాధర్ సిద్ధపోశెట్టి మిద్దిపెద్దులు కాశ రవి మన్నె పోశెట్టి మక్కన్న గోపాల్ తదితరులు పాల్గొన్నారు