పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల వ్యాప్తంగా గ్యాస్ కష్టాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. యుద్ధ ప్రభావంతో మొదలైన గ్యాస్ కష్టాలు నేటికీ తీరే పరిస్థితి లేదు.ఏన్కూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీ వాహనాలు వచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. బ్లాక్ మార్కెట్ లో సిలిండర్ ధర రూ. 1000/. నుండి 2000/ వరకు పలుకుతుందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కొంతమంది గ్యాస్ కొరత కృత్రిమంగా సృష్టించి, గ్యాస్ అపోహలు కల్పించి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టాలంటే బుక్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్ అందించాలని వారు కోరుతున్నారు. జిల్లాలోని సివిల్ సప్లై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని బుకింగ్ ప్రకారం సిలిండర్లను సకాలంలో అందించాలని ఆదేశిస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.