పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆదోని డివిజన్ బీ.సీ.ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రావు 135వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా బీ.సీ.నాయకులు జిల్లా గౌరవ అధ్యక్షులు పి.సాయి బాబ, ఆదోని డివిజన్ ఉపాధ్యక్షులు, దేవిశెట్టి ప్రకాష్, ధనాపురం శేషన్న, కత్తి హనుమంతరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. షేక్ షావలి, మాల మహానాడు నాయకులు కుంకునూరు వీరేష్, మరియు బీ.సీ.నాయకులు శ్రీనివాస్ భవన్ కూడలి నందు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీమ్ రావ్ రాంజీ (డాక్టర్ బాబా సాహెబ్అంబేద్కర్)గా సుపరిచితుడు( 1891 ఏప్రిల్ 14– 1956 డిసెంబర్ 6 ) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.అతను భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి, ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్. సి( డాక్టరేట్ ) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. సామాజిక న్యాయ, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, అధ్యాపకుడిగా పనిచేశాడు తర్వాత భారతదేశ స్వాతంత్ర పత్రికలు ప్రచురణ, దళిత సామాజిక, రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో తను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా గౌరవ సలహాదారులు ఎం వీరభద్ర, జాయింట్ సెక్రెటరి ఆర్.రామకృష్ణ, టౌన్ ఆర్గనైజ్ సెక్రటరీ బి. మల్లేశ్వరప్ప టౌన్ గౌరవ సలహాదారులు బెస్త ప్రకాష్, జి.నల్లారెడ్డి, జాయింట్ సెక్రెటరీ పగడాల కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ కత్తి ప్రసాద్, దీపక్ కుమార్, దండు అయ్యాలప్ప సలకలకొండ ఆనంద్ , తోన్ పే తాయప్ప, బెస్త గోవింద్ తదితరులు పాల్గొన్నారు.