ఆదోనిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో, మాజీ శాసనసభ్యులు మరియు టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి, శ్రీనివాస్ భవన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ:- భారత రాజ్యాంగ శిల్పి, మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని మనం ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. ఆయన చూపిన సమానత్వం, న్యాయం, స్వాభిమాన మార్గాలు ప్రతి ఒక్కరికీమార్గదర్శకం.అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు వెలుగునిచ్చిన మహోన్నత వ్యక్తి. ఆయన ఆలోచనలు ఈ దేశానికి శాశ్వత ప్రేరణన్యాయబద్ధమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు బాబాసాహెబ్ జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తిబేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేడ్కర్ఎలాంటి అవకాశాలు లేని సమయంలో ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారునిమ్న జాతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడి, వారికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన వ్యక్తి అంబేడ్కర్‌ప్రతి ఒక్కరూ విద్యతో చైతన్యాన్ని, సాధికారతను సాధిస్తారని ఆయన నినదించారునేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చి అంబేద్కర్ తన మేధస్సుతో మదించి సమకూర్చినవే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *