అంబేద్కర్ కీర్తి అజరామరం.. అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం!

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 15 ,తల్లాడ రిపోర్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తల్లాడ మండలం మల్లవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలను గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గుర్రం యశోద ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ అణగారినవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయులు . పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు. సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వాప్నికుడు .భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహా మేధావి అంబేద్కర్. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేరేలా చేసిన దార్శనికుడు అని పేర్కొన్నారు అంబేద్కర్ గారి బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అందించేలా.. కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కులం పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గాని నిర్వహించలేమని స్వతంత్ర భారతావని ప్రజాస్వామ్య పునాదులపై సాంఘిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛలను ప్రసాదించిన మహానీయుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన చిరస్మరణీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనివారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సిద్ధిక్ మియా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్య అంజయ్య గ్రామపంచాయతీ సిబ్బంది డి వెంకటేశ్వర్లు పి పుల్లయ్య నరసరావు అశోక్ రవి సత్యం వెంకయ్య మీడియా కోఆర్డినేటర్ దొనకొండ ఉపేందర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *