ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు

వైఎస్సార్సీపీ నిరసనలపై జిల్లా టీడీపి మహిళా అధ్యక్షురాలు కర్రీ శేషారత్నం ధ్వజం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వైఎస్సార్సీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని జిల్లా టీడీపి మహిళా అధ్యక్షురాలు కర్రీ శేషారత్నం తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం రంగంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్సీపీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు.నిరసనలు కేవలం రాజకీయ డ్రామారాధాకృష్ణ మాటలను తమకు అనుకూలంగా మార్చుకుని, మహిళలను కించపరిచినట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని శేషారత్నం అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి ‘రాజకీయ నాటకాలకు’ తెరలేపారని ఆమె ఆరోపించారు. ఏబీఎన్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలపడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడమే వారి ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.మహిళలను కించపరుస్తోంది వైఎస్సార్సీపీనే!గత ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, “నిజంగా మహిళలను కించపరిచే సంస్కృతి వైఎస్సార్సీపీదే” అని ఆమె దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా మహిళా నాయకురాళ్లపై అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు ఈ వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడ ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు ఒక పత్రికా ప్రతినిధి మాటలను పట్టుకుని రచ్చ చేయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారుచంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా భద్రతకు పెద్దపీట వేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్ జగన్ ఇటువంటి అంశాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో మహిళలే వారికి తగిన గుణపాఠం చెబుతారని కర్రీ శేషారత్నం హెచ్చరించారు.ఈ సమావేశంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డితో పాటు పలువురు టీడీపి మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *