
పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 15 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, మరియు జై భీమ్ వారియర్స్ టీం సభ్యుల అధ్యక్షతన మహనీయుడు,విశ్వజ్ఞాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు మంగళవారం పంచాయతీ కార్యాలయం మరియు అంబేద్కర్ భవన్ నందు ఘనంగా జరిగాయి. ఈ జయంతి వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు,అన్ని వర్గాల ప్రజలు, రైతులు, యువతి యువకులు,జై భీమ్ వారియర్స్ టీం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ నిన్న జాతి వర్గాలకే మహనీయుడు కాదని ఆయన అందరివాడని తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పేర్కొన్నారు,ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యుడని ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం మూలంగానే ఈరోజు నాలాంటి సామాన్యునికి కూడా ఈ రకమైన గౌరవం దక్కుతుందని ఆయన సర్వజనులకు మహనీయుడని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్ స్త్రీలకు కూడా సమాన వాటా దక్కాలని ఆనాడే అనేక ఉద్యమాలు చేశారని ఆయన చేసిన ఉద్యమ ఫలితాలే ఈరోజు మహిళలు అనుభవిస్తున్న ఈ 33% అవకాశాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు, పంచాయతీ వార్డు మెంబర్స్, పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, గుమస్తా రమేష్, స్థానిక సీనియర్ నాయకులు బొమ్మగాని నాదం, దొడ్డ చిన్న శ్రీనివాసరావు,గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్) ఎస్సీ సెల్ నాయకులు ఇస్నపల్లి శ్రీనివాసరావు, యువ నాయకులు గోవిందు సురేష్, విద్యావంతుడు కోపెల రాము, గొడ్ల సురేష్,కందుల నారాయణ, ఇస్నపల్లి చిన్నకృష్ణ, దారా కృష్ణ,గొడ్ల మోసే, గొడ్ల జాన్ వెస్లీ, ప్రసన్నకుమార్, సీతారాములు, వెంకటరత్నం, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, మల్టీపర్పస్ వర్కర్లు, పంచాయతీ సహా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.