ఏప్రిల్ 14న మహాత్ముల జయంతులను పురస్కరించుకొని

ఆదోని జిల్లా సాధన 150వ రోజు సభను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్11ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోనిలో జనాభాకు తగ్గ వనరులు ఉన్నప్పటికీ వాటిని సరైన పద్ధతిలో వినియోగించకుండా రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రజలకి అందవలసినటువంటి ప్రభుత్వ సేవలు ఏవి కూడా సరైన పద్ధతిలో అందడం లేదు. అందువల్లే ఆదోని జిల్లా తోనే అభివృద్ధికి తోడ్పడుతుందని పరిపాలన వికేంద్రీకరణ వలన ప్రభుత్వ సేవలు సరైన పద్ధతులు అందుతాయని ఆదోని జిల్లా సాధన జేఏసీ కమిటీ నాయకులు తెలియజేస్తున్నారు. నిరుపేద ప్రజలు సామాన్య ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి వైద్యం విద్యా ఉపాధి నీరు లాంటి ముఖ్యమైనటువంటి సేవలను కల్పించలేకపోవడం వల్లే ఆదోని ప్రాంతం అభివృద్ధి చెందలేదు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలు ఆలూరు, ఎమ్మిగనూరు ,మంత్రలయం, పత్తికొండ ,ఆదోని 5 నియోజకవర్గలు కలిపి ఆదోని కేంద్రంగా జిల్లాని ప్రకటించాలని 146వ రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా కొనసాగింది. 146వ రోజు రిలే నిరాహార దీక్షలో బండారి హనుమంతు, పగడాల కోదండ, రామాంజనేయులు, పి కుమార్, రామకృష్ణ కూర్చుని ఆదోని జిల్లా ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వైపి నాగరాజు, దాసరి గోవిందు, మాట్లాడుతూ ఏప్రిల్ 14న ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో 150వ రోజు భారీ బహిరంగ సభతో ఆదోని ప్రాంతంలో పెద్ద ఎత్తున అట్టుడికి పోయేలా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు.146వ రోజు రిలే నిరాహార దీక్ష ,కార్యక్రమంలో జేఏసీ, గుమ్మల బాలస్వామి, ప్రకాష్, పి ఎస్ వీరేష్, రాజు, వీరభద్ర స్వామి, సుభాష్ చంద్రబోస్, సుజ్ఞానమ్మ, కాంతరాజు, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *