ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలి

యువజన కాంగ్రెస్ డిండి మండల అధ్యక్షులు గడ్డమీది సాయి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ డిండి మండల అధ్యక్షులు గడ్డమీది సాయి మాట్లాడుతూ దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సామాజిక న్యాయం సాధించాలంటే బాలూనాయక్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.ఎంపీటీసీ గా ప్రారంభించి,మార్కెట్ కమిటీ చైర్మన్,జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కీలక పాత్ర పోషించిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా గుర్తు చేశారు.దేవరకొండ లో రోడ్లు ,విద్యుత్ , తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించి గిరిజన ప్రాంతాల రూపురేఖలు మార్చినా అభివృద్ధి ప్రదాతగా బాలునాయక్ నిలిచారని ఆయన ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *