గ్రీవెన్స్ నిర్వహించిన పలాస శాసన సభ్యురాలు గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం, మందస, పలాస మున్సిపాలిటీ, వజ్రపు కొత్తూరు మండలం ప్రజలు ప్రజా సమస్యలపై పలాస ఎమ్మెల్యే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు “ప్రజా దర్బారును శనివారం నిర్వహించారు.అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పార్టీ రహితముగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాది రేఖలు వచ్చాయి.ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే కృషి పట్ల పలువురు అభినందించారు. ముఖ్యంగా మండలం నుండి 42 ఫిర్యాదులు రాగా ఆ పిర్యాదులు భూ వివాదాలు,రెవెన్యూ, రేషన్ డిపోతోపాటు రహదారుల సమస్యలు,విద్యుత్ కోతలు,తాగునీటి సమస్యలు,ప్రధాన సమస్యలే ఆమె దృష్టికి వచ్చాయి. దీనితోపాటు రేషన్ కార్డులు కావాలని పింఛనులు కావాలని,ఇల్లు స్థలాలు కావాలని, గృహ నిర్మాణాలు చేపట్టాలని,వృద్ధులు వికలాంగులు,వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే గారు స్వయంగా మాట్లాడి ఈ సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూటమి పాలనలో భాగముగా టీడీపీ,బిజెపి,జనసేన, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *