పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 యడ్లపాడు మండల ప్రతినిధి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థాధిపతి వేమూరి రాధాకృష్ణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏబీఎన్ చానల్ మరియు ఆంధ్రజ్యోతి పత్రికలో వైయస్ఆర్ సీపీ నేతల కుటుంబాలను, వారి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేసిన, ప్రచురించిన విషయాలు పాత్రికేయ ధర్మానికి, సామాజిక నైతిక విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత అసహ్యకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, మహిళల పట్ల చేసిన అవమానానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రివర్యులు విడదల రజిని ఆదేశాల మేరకు, చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు