ఏజెన్సీ చట్టాల ను తుంగలో తొక్కుతున్న పట్టించుకోరా నరేష్ జాదవ్

* 1/70 చట్టానికి తూట్లు * అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు * గిరిజనుల భూములు గిరిజనేతరుల పరం * ఏన్కూరు మండలా ల చుట్టూ కబ్జాకోరుల దందా * అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం, ఐదో షెడ్యూల్ నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారు. గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు,
భూ కబ్జాలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడుతూ ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన 1/70 చట్టం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు భూమి బదలాయింపు నిషేధం ఉన్నప్పటికీ, వందల ఎకరాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. అక్రమ కట్టడాలు: ఏన్కూరు మండలంలో అనుమతులు లేకుండానే మల్టీ అంతస్తుల భవనాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు నిర్మిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం:

ముడుపుల మత్తులో అధికారులు చట్టాలను అమలు చేయడం లేదని, కబ్జాలను అడ్డుకోవడం లేదని ఖమ్మం జిల్లా గిరిజన నాయకుడు నరేష్ జాదవ్ ఆరోపిస్తున్నారు నకిలీ పట్టాలు:

ఆదివాసీలను రుణాల పేరుతో మోసం చేసి, భూములను లాక్కుని, నిజాం కాలం నాటి నక్షాలను కూడా మారుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ దందా:

ఏన్కూరు వంటి ప్రాంతాల్లో అసైన్డ్ భూముల్లో కూడా భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ అక్రమాలపై ఫిర్యాదులు చేసినా అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారని బాధితులు గిరిజన సంఘాలు ఖమ్మం జిల్లా గిరిజన నాయకుడు నరేష్ జాదవ్ వాపోతున్నారు.

ఖమ్మం జిల్లా గిరిజన నాయకుడు నరేష్ జాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *