పయనించే సూర్యుడు ఏప్రిల్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం ఎమ్మెల్యే పంతం నానాజీ క్యాంపు కార్యాలయంలో జన సైనికులు వీర మహిళలు అంబేద్కర్ యూత్ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. భారీ కేకలు కట్ చేసి అభిమానుల మధ్య ఆనందాన్ని పంచుకున్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్రహావిలో నిలబెట్టిన ఘనత అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని ఎమ్మెల్యే పంతం నానాజీ గుర్తు చేశారు. ఆనాడు భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చిన నేటికి ఆ దేశాలు అభివృద్ధి చెందలేదని ఆర్థిక సంక్షేమంతో తీవ్రవాద ఉచ్చులో పయనిస్తున్నాయని అన్నారు. అందరి అభిమాన నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పాండ్రంకి రాజు,, మెండు గోవిందు, వల్లూరి రాజా లు మాట్లాడారు. జన సైనికులు వీర మహిళలు ఎస్సీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.