మాట నిలబెట్టుకున్న బానోత్ మంజుల మదన్ లాల్

* మదన్ లాల్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తాను వారి ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రయాణిస్తానని తెలిపారు * ప్రతి పేదవాడి సమస్యను నా సమస్యగా భావించి నెరవేర్చే విషయంలో వారికి వెన్ను గా ఉంటాను

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలంలోని కొత్త మేడిపల్లి పాఠశాలలో బీరువాలు బోర్డు మరియు క్యారం బోర్డు వితరణ చేసిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ ఈ మధ్యకాలంలో కొత్త మేడే పల్లిలో పర్యటించిన సమయంలో పిల్లలు పడుతున్న ఇబ్బందులను చూసి పాఠశాల టీచర్ లకవత్ చంద్రశేఖర్ ఉపాధ్యాయునితో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని వాళ్ల సమస్యలను పరిష్కరిస్తాను మరియు వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ముందుంటాను అని హామీ ఇచ్చారు ఆ హామీని తూచా తప్పకుండా నెరవేర్చినందుకు అక్కడి ప్రజలు మరియు ఆ స్కూల్ టీచర్లు మరియు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు రైలు,బుల్లయ్య, బాబు, కేసు పల్లి వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *