సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన సర్పంచ్ కావలి శివాని సురేష్ .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్.10. రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ఉడతలపల్లి గ్రామ సర్పంచ్ కావలి శివాని సురేష్ పంపిణీ చేశారు.  రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉడతలపల్లి గ్రామ సర్పంచ్ కావలి శివాని సురేష్ పంపిణి చేశారు . సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందిన వారు చిలక రాజు శ్యామ్ 28000, కావలి చిరంజీవి 36000 , కావాలి వెంకటేశం 11500, మారగొని శంకరయ్య 31000.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత రమేష్ , మాజీ ఉపసర్పంచ్ గంట తులసయ్య , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుషిపాక శంకర్ వార్డ్ సభ్యులు , మెరుగు అమృత, కావలి నందబాబు అదేవిధంగా గ్రామస్తులు కావలి కాంతారావు కావలి నాగరాజు గంట ఈదయ్య కోటేష్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *