పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం మిర్చి మార్కెట్లో దడవాయిల మాయాజాలం బయటపడుతోంది.రైతులు ఆరుగాలం ఎంతో శ్రమించి పండించిన మిర్చిని మార్కెట్‌కు తీసుకువచ్చిన తర్వాత, కాంటాల్లో (తూకాల్లో) మోసపోతున్నారు,మిర్చి మార్కెట్లో దడవాయిలు, కొంతమంది వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి,తూకం వేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా తక్కువ బరువు చూపించడం,తేమ శాతం పేరుతో క్వింటాళ్లకు భారీగా కోతలు పెట్టడం వంటి చర్యలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఓ రైతు పదిహేడు బస్తాలను అమ్మకం నిమిత్తం ఖమ్మం మిర్చి మార్కెట్ కు తీసుకురాగా “నవీద్ ట్రేడర్స్” అనే వ్యాపార సంస్థ కొనుగోలు చేసింది, కాంటా వేసారు పదిహేడు బస్తాలకుగాను అయిదు క్వింటాల నలబై రెండు కేజీలు చూపించి సదరు దడవాయి లెక్కలకు సంబంధించిన రశీదు కూడా ఇచ్చాడు, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది,ఎందుకో రైతుకు,కమీషనుదారుకి కాంటాపై అనుమానం వచ్చింది,పదిహేడు బస్తాలు ఐదు క్వింటాలు పై చిలుకు రావడం ఏమిటనే ఆలోచనతో తిరిగి కాంటా పెట్టించారు ఆరు వందల తొంబై ఒక్క కేజీ తూకం వచ్చింది,ఈ విషయం మీద రైతు కమీషనుదారు కలిసి మార్కెట్ అధికారులకు పిర్యాదు చేయగా అధికారులు పంచనామా నిర్వహించి అదే దడవాయి,అదే మిషన్ తో కాంటా నిర్వహించగా ఆరు వందల తొంబై మూడు కేజీల తూకం వచ్చింది,దీన్ని బట్టి చూస్తే వ్యాపారులు, దడవాయిలు కలిసి రైతులను ఎంత మోసగిస్తున్నారనే విషయం అర్థమవుతుంది పదిహేడు బస్తాలకే క్వింటన్నర తూకం తేడా వస్తే మిర్చి సీజన్లో రైతులు లక్షల బస్తాలు మార్కెట్ కు తీసుకు వస్తారు అలాంటపుడు ఎన్ని లక్షల క్వింటాలు తేడా వస్తుంది,ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతులను మోసం చేస్తున్నారనే విషయం తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, తప్పుడు కాటాలతో రైతులను మోసం చేస్తున్న దడవాయిలు,వ్యాపారులపై కటిన చర్యలు తీసుకుని వారి లైసెన్సులు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే వ్యాపారులు, దడవాయిలు కలిసి రైతులను నిలువునా దోపిడి చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో రైతులను ఇంకెంత మోసానికి గురవుతున్నారోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దడవాయిలు, వ్యాపారుల మోసాల గురించి ఓ రైతు మాట్లాడుతూ మార్కెట్ కు తీసుకువచ్చిన మిర్చి క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల వరకు తేడా చూపిస్తున్నారని,పైగా ధర కూడా తక్కువగా చెప్పి అమ్మకానికి ఒత్తిడి తెస్తున్నారని,వేలంపాట ప్రక్రియ కూడా పారదర్శకంగా జరగకపోవడం వలన రైతులకు సరైన ధర లభించడం లేదని,దడవాయిలు ముందుగానే వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని, మార్కెట్‌లో ధరలను తమ ఇష్టానుసారం నియంత్రిస్తున్నారని ఆరోపించారు,అదే విధంగా రైతు సంఘాలు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వెంటనే చర్యలు తీసుకుని,తూకాల్లో పారదర్శకత తీసుకురావాలని, ఎలక్ట్రానిక్ తూకాలు తప్పనిసరి చేయాలని, ప్రతి లావాదేవీని డిజిటల్‌గా నమోదు చేయాలని డిమాండ్ చేశారు,మిర్చి రైతుల కష్టానికి తగిన న్యాయం జరగాలంటే, మార్కెట్ వ్యవస్థలో పారదర్శకత, కఠిన నియంత్రణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు ఈ విషయం ఇలా ఉంటే తప్పుడు కాంటాల విషయం బయటకు పొక్కకుండా మార్కెట్ పాలక వర్గంలోని ఇద్దరు అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి అధికారులను,రైతును, వ్యాపారిని మేనేజ్ చేసి ఇంత పెద్ద విషయాన్ని మసుబూసి మారేడు కాయ చేసి రాజీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి