కొత్త స్లూయిజ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు.

ఏజెన్సీ ప్రాంతంలో చెరులకు స్లూయిజ్లు మరియు కొత్త తూములు ఏర్పాటు చేయాలని గతంలో వినతి పత్రాలు అందజేసిన ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.11.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని మరియు శరభవరం గ్రామపంచాయతీ పరిధిలోని మొత్తం 15 చెరువులను నీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భూగర్భజలాల వృద్ధికి వంద రోజుల ప్రణాళికలో భాగంగా పరిశీలించడం జరిగిందని.దేవీపట్నం ఇన్చార్జి ఇరిగేషన్ శాఖ ఏ.ఈ సుందర్ సింగ్ తెలియజేశారు.అధికారుల బృందం మరియు ఆయకట్టు రైతులు కలిసి నిన్న ఈరోజు 15 చెరువులను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి చెరువుకు స్లూయిజ్లు కృంగిపోవడంతో నీరు పూర్తిస్థాయిలో నిల్వఉండక పోవడంతో ప్రతి సంవత్సరం ఖరీఫ్ సాగుకు ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని,వచ్చే తొలకరి నుండి అయిన త్వరితగతిన సకాలంలో సాగునీరు అందించాలని,చెరువులు పరిశీలించడానికి వచ్చిన అధికారులకు ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర,సొసైటీ మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర విజ్ఞప్తి చేశారు.అలాగే గతంలో ఏజెన్సీలో ఉన్న చెరువులకు స్లూయిజ్లు మరియు కొత్త తూములు ఏర్పాటు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో వారికి వినతి పత్రాలు ద్వారా తెలియజేసేమని గుర్తు చేశారు.చెరువులను పరిశీలించిన అనంతరం దేవారం గ్రామ పంచాయతీలోని కమ్యూనిటీ హాల్ వద్ద గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవీ పట్నం ఇంచార్జ్ ఇరిగేషన్ శాఖ ఏ.ఈ సుందర్ సింగ్ మాట్లాడుతూ…మెట్ట చెరువులలో భూగర్భ జలాలు వృద్ధికి వంద రోజుల ప్రణాళికతో ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి రైతులకు ఉపయోగపడేలా మరియు భూగర్భంలోకి ఇంకేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు.ఇప్పటివరకు గుర్తించిన 15 చెరువులలో పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మడకం వెంకటేష్ దొర,తుర్రం రమేష్ దొర,కారం సత్యనారాయణ దొర,కారం బాపన్న దొర,తిక్కి శెట్టి సత్యనారాయణ,కారం రమేష్ దొర,తుర్రం రామకృష్ణ దొర,కొమరం చిన్నబ్బాయి,గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు,దేవారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ మణికంఠ,శరభ వరం గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాంబాబు,ఇంజనీరింగ్ అసిస్టెంట్ చిన్నబాబు,ఫీల్డ్ అసిస్టెంట్ కారం లక్ష్మి,అగ్రికల్చర్ అసిస్టెంట్ హేమలత,మహిళా పోలీస్ మంజుల,పంచాయతీ గుమస్తా అడబాల పుల్లారావు మరియు రైతులు మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *