రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు )రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి దస్పల్ల హోటల్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ.. రాజ్యసభలో తెలంగాణ వాణిని మరింత బలంగా వినిపించి, రాష్ట్ర అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *