అభివృద్ధి పథంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

* బిల్లుపాడు సర్పంచ్ ఎన్నిక కృష్ణవేణి నరసింహారావు * గ్రామాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి*సర్పంచ్ * జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్ సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 12, తల్లాడ రిపోర్టర్ అభివృద్ధి పథంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా ని బిల్లుపాడు గ్రామ సర్పంచ్ ఎన్నిక కృష్ణవేణి నరసింహారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన- ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో పరిశుభ్రత కార్యక్రమాలను దోమ ద్వారా వ్యాపించే వ్యాధులు నివారించేందుకు ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వార్డులలో ప్రతి బజారును పరిశీలించి, పిచ్చి మొక్కలను తొలగించి చెత్తాచెదారం లేకుండా రోడ్లను క్లీన్ చేయించారు. గ్రామంలోని వీధిలైట్లు వెలగకపోవడంతో వాటిని పరిశీలించి , లైట్లను అమర్చి నిరంతరం విద్యుత్తును అందిస్తున్నామని ఆమె తెలిపారు. అదేవిధంగా వేసవిలో తాగునీటి సరఫరా ప్రజలకు నిరంతరం అందించేందుకు బోర్లు మరమ్మతులు, పైపు లీకేజీలను నివారించి నీటి సరఫరాను ప్రజలకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నిక కృష్ణవేణి నరసింహారావుమాట్లాడుతూ . డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్ వారి సహకారంతో ‌ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి బి. సాయికుమార్, పంచాయతీ గుమస్తా లాజర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *