
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 12.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల0 ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి గ్రామంలో విరాజిల్లుతున్న భక్తులుకోరిన కోరికలు తీర్చే120 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన అతి పురాతనమైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శుభ శనివారం సందర్భంగా జె. హరినాథ్ సరస్వతమ్మ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయం లోపల ఉదయం 6 గంటలకు నీటితో శుద్ధపరిచి గడపలకు గుమ్మాలకు పసుపు కుంకుమ సింధూరంతో బొట్ల పెట్టి మామిడి ఆకుల తోరణాలు కట్టి స్వామి వారి విగ్రహాన్ని నీటితో శుద్ధపరిచి పసుపు కుంకుమ సింధూరంతో బొట్లు పెట్టి ప్రత్యేకమైన రంగురంగుల పూలతో అలంకరించి పూల మాలలు వేసి భక్తిశ్రద్ధలతో పూజించారు పాలు పెరుగు నెయ్యి ఆపిల్ పండ్లు అరటి పండ్లు దానిమ్మ పండ్లు ద్రాక్ష పండ్లు మిశ్రమంతో పంచామృతం చేసి దేవదేవునికి నైవేద్యంగా పెట్టి అభిషేకము అర్చనలు వస్త్రాలంకరణ అష్టోత్రము శ్రీ హనుమాన్ చాలీసా శ్రీ హనుమాన్ భుజంగస్తోత్రం అష్టోత్రము వంటివి పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అగరవత్తులు వెలిగించి తమలపాకులతో ఆకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో అర్చనలు అభిషేకాలు చేశారుఈరోజు ఉ భయ దారులుగా జె.హరినాథ్ సరస్వతమ్మ వ్యవహరించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రీ అభయ అభయాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్ట దైవమని అన్నారు ఆయనకు తమలపాకుల దండ సింధూరం సమర్పించిన భక్తులకు ఎలాంటి కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసంఅలాంటి స్వామివారి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అన్నారుభక్తులకు తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందాఅంటూ గోవింద నామస్మరణలతో ఆలయంలోపల భక్తులు నినాదాలతో ఆలయం కిటకిటలాడింది ఈ పవిత్రమైన శుభ శనివారం సందర్భంగా గాండ్ల పల్లె ప్రజలందరికీ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో తులతూగాలని లోకం సుభిక్షంగా ఉండాలని భక్తాదులు శ్రీ అంజన్నను వేడుకున్నారు