
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 12. చండూరు మున్సిపాలిటీ లోని సన్ షైన్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని అభినందించారు . ఇలాంటి విద్యాసంస్థలు సమాజానికి మంచి పౌరులను అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న ప్రీ ప్రైమరీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రైమరీ విద్యాభ్యాసాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కాబోతుంది కావున వారు ప్రైమరీ విద్యా స్థాయిలోనే క్రమశిక్షణ ఆలోచన విధానం నడవడిక అదేవిధంగా చదువులోనూ ముందంజలో ఉంటూ సన్ షైన్ పాఠశాల యొక్క పేరును దినదినాభివృద్ధి చేయాలని అదేవిధంగా వారి తల్లిదండ్రుల యొక్క ఆశయాలను అందుకోవాలని అన్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహణ ద్వారా ఒక నూతన ఒరవడిని సృష్టించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్మాణం గురించి వారికి వివరించడం జరిగింది. భావి భారత ఉత్తమ పౌరులుగా పేరు ప్రఖ్యాతులు పొందాలంటే ఇప్పటినుండే పట్టుదలగా అనుకున్నది సాధించడం కోసం కష్టపడాలని నిరంతరం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన అవగాహనను పెంపొందించుకోవాలని అన్నారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో చేరిన తొలినాలలో భయంగా ఉన్న ప్రీ ప్రైమరీ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ భయాన్ని నిర్భయంగా మార్చుకొని భవిష్యత్తు నిర్మాణం కోసం కరస్పాండెంట్ కోడి వెంకన్న గారి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తామని అన్నారు. అదేవిధంగా మా ప్రీ ప్రైమరీ విద్యను మధుర జ్ఞాపకాలతో పూర్తిచేసే విధంగా సహకరించిన టీచర్లకు కరస్పాండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ వెంకన్న ప్రిన్సిపాల్ రవికాంత్ కార్యక్రమ నిర్వాహకులు రమేష్ , లతీఫ్ పాషా మరియు ఉపాధ్యాయినీలు తదితరులు పాల్గొన్నారు.