మహనీయుల సేవలు మరువలేనివి

మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్

పయనించే సూర్యడు ఏప్రిల్ 12 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మహనీయుల సేవలు మరువలేనివాని అని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ సుధీర్ అన్నారు శనివారం మండల కేంద్రంలో చేయూత ఫౌండేషన్ & మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహాత్మ జ్యోతిబాపూలే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే అంటరానితనం,కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు అని అదేవిదంగా 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన వారు ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు అని వారు కొనియాడారు.మహనీయుల సేవలు మరువలేనివని ప్రతి ఒక్కరు వారి త్యాగాలను గుర్తించుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేకల వీరబాబు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ నడిగూడెం గ్రామ ఉపసర్పంచ్ ఏలుగురి నాగరాజు మాజీ వైస్ ఎంపీపీ గుండు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ చిల్లంచర్ల సత్యనారాయణ బోనగిరి ఉపేందర్ ఎంఈఎఫ్ జాతీయ నాయకులు కత్తి వెంకటేశ్వర్లు కన్నెబోయిన వెంకటేశ్వర్లు మాతంగి ఏసుబాబు కాసాని శివకృష్ణ పాతకోట్ల శ్రీను దున్న ప్రదీప్ దున్న రాజు రాజుల గురు స్వామి మేకల వీరేష్ పల్లపు శ్రీను కుంభజడ శ్రీను తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *