పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..

తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు(చిన్నబ్బాయి)

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 13, తల్లాడ రిపోర్టర్ పూలే ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగ్యసాములు కావాలని తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు అన్నారు. శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ కార్యాల ఆవరణలో సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి) పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి)మాట్లాడుతూ.. భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి, ఆ తర్వాత ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆ రోజుల్లో కుల వివక్ష కారణంగా అనేక వర్గాల ప్రజలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను పూలే ధైర్యంగా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. అందుకే వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *