తమ్మడపల్లి లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

మట్టి బాలరాజ్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు తమ్మడపల్లి గ్రామంలో శాంతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ నినాదాలతో పరిసరాలను మారుమ్రోగించారు. బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం సాధించేందుకు పునాదివేశారని మట్టి బాలరాజ్ కొనియాడారు. ముఖ్య అతిథులుగా మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ఉపాధ్యక్షులు మట్టి బాలరాజు, తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ బెజాడి సిద్దులు ఉప సర్పంచ్ గోలకొండ నాగరాజు మండల్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ షరీఫ్, కాశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 1వ వార్డు సభ్యుడు సానిక కనకరాజు 2వ వార్డ్ సభ్యుడు అబ్బసాని వేణు 8 వ వార్డు సభ్యులు మేకల భవాని రమేష్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు జన్నె మల్లేశం చింతల శ్రీనివాస్ రెడ్డి, బెజాడి నాగరాజు, మండల నాయకులు సర్పంచ్ ఇజ్జగిరి రాములు, జిల్లా సందీప్, ఆముదాల మల్లారెడ్డి, చెరుకూరి శ్రీనివాస్, నీల రమేష్, జంగిడి సిద్ధులు మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షులు మట్టి బాలరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *