ఎం ఆర్ సి లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 15.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) భారత రాజ్యాంగ రూపకర్త , భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక ఎం ఆర్ సి ప్రాంగణంలో చౌడేపల్లి ఎస్ టి యు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, జోహార్లు అర్పిస్తూ ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారులు కేశవ రెడ్డి తిరుమలమ్మ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర సమరంలో భారత రాజ్యాంగ రూపకల్పనలో ఎనలేని కృషిచేసి అందరి హృదయాలలో స్థిరస్థాయిగా , మార్గదర్శకులుగా నిలిచారని అంబేద్కర్ సేవలను కొనియాడడం జరిగినది. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ సమాజంలోని వెనుకబడిన వర్గాలు కూడా విద్య ఉద్యోగాలలో రాణించుటకు, అస్పృశ్యత నివారణకు అనేక ఉద్యమాలు చేసి రిజర్వేషన్ల అమలకు ఎనలేని కృషి చేశారని తెలియజేయడం జరిగినది. మండల అధ్యక్షులు వసంత మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు మహిళా అధ్యక్షులు సుమిత్ర, ఆర్థిక కార్యదర్శి షబ్బీర్ అహ్మద్ మరియు కార్యవర్గ సభ్యులు నాగరత్నమ్మ , మురళీమోహన్, తులసి నాగరాజ, విజయ కుమారి, సుధాకర్ నాయుడు, వెంకటస్వామి, కృష్ణవేణి, భాను, శేషాద్రి సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *