అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా చేసిన ఆయన కృషి వెలకట్టలేని.

పయనించే సూర్యుడు13-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్,ఆధ్వర్యంలో గౌరవ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామ స్మరణ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిధిగా విజయదుర్గ సేవా సమితి సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం న్యాయవాది చిన్నాడి విశాల్ ఆదిత్య రావు మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి గౌరవ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరేలా ఆయన చేసిన కృషి వెలకట్టలేని లేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో.. చిన్నాడి రాజనర్సింహారావు,సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి,శాతల లక్ష్మణ్, న్యాయవాది చిన్నాడి ఆదిత్య రావు,పొన్నగంటి రాజరత్నం ప్రేమ్, వార్డు సభ్యులు క్యాష్ సతీష్, ఆవుల రాజశేఖర్, శ్రీ కోటి నీలకంఠం, సజ్జనపు రవి, ఎనగందుల సాయి, మద్దూరి నవీన్, సంఘం భరత్, ప్రణయ్, నరేష్, అంకం అరుణ్, తదితరులు గ్రామస్తులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *