బిజెపి ఆధ్వర్యంలో కొత్తపేట లో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి ఓబిసి మోర్చ జిల్లా నాయకులు ఇళ్ల పల్లంశెట్టి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బిజెపి రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేసారు ముందుగా సత్యానందం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ ఫూలే కులరహిత సమాజం కోసం బుడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారని మహిళోద్దారణకు కృషి చేశారని అన్నారు దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి “సత్యశోధక్” సమాజ్ ను ఏర్పాటు చేశారన్నారు . వారి ఆశయాలకు అనుగుణంగా బిజెపి వెనుకబడిన తరగతులకు చెందిన నరేంద్ర మోడీ ని దేశ ప్రధానిగా చేసిందన్నారు . నరేంద్ర మోడీ గారి సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు అనేక సంక్షేమ పథకాలతో పాటూ చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించిందన్నారు .ఆ మహనీయుని అడుగు జాడల్లో నడుచుకునే నిస్వార్థ నాయకులనే ప్రజలు ఎన్నుకోవాలని ఈసందర్భంగా తెలియజేశారు ఈకార్యక్రమంలో sc మోర్చా జిల్లా అధ్యక్షులు పొనుగు పాటి శ్రీనివాస్, రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ,యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోటిపల్లి దామోదర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవ స్వామి, సబ్బవరపు సత్యనారాయణ,బిజెపి యువమోర్చ మండల అధ్యక్షుడు వలపుశెట్టి కిరణ్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *