కస్తాల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .

* నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం . * ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు ఆపన్న హస్తం. * సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 13. చండూరు మండలం కస్తాల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో లబ్ధిదారులకు కస్తాల గ్రామ శాఖ అధ్యక్షుడు కల్మికొండ మల్లేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. లబ్ధి పొందిన ఆరుగురు వ్యక్తులకు 1,88,500 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. మెండు నారాయణరెడ్డి 36వేల రూపాయలు, నిమ్మల సంజీవరెడ్డి 48,000, గురజాల లక్ష్మ లక్ష్మమ్మ 30,500, గుడిపల్లి సుమతమ్మ 22,000,/- జాల గణేష్ 23000, కంచరకుంట్ల లక్ష్మమ్మ 29000. రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెక్కులు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి నాతల వనజ విష్ణువర్ధన్ రెడ్డి, ఎఫ్ ఎస్ మాజీ డైరెబిక్షం కట్ట బిక్షం, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పంగ రామకృష్ణ, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గంటకంపు అశోక్, వార్డు మెంబర్లు కట్ట సైదులు, గురుజాల రమ్య, దోనాల శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండమల్ల నరసింహ, ఆకారపు మల్లయ్య, జాల రవీందర్ రెడ్డి, గురిజాల స్వామి, కట్ట రామకృష్ణ, జాల రాములు,జింకల సునీత, జాల నరసింహ,కస్తాల గ్రామ పెద్దలు మెండు బ్రహ్మానందరెడ్డి, మేకల సత్తిరెడ్డి, మోహన్ రెడ్డి, జింకల జిన్నాభాయ్, గంట భరత్, నాంపల్లి ప్రవీణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *