పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 సాలుర: రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో దానికి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రైతు దుక్కి దున్ని, నారు పోసి ఎరువులు పురుగుమందులు వ్యవసాయ కూలీలు ఇంటి యజమాని కూలీ బ్యాంకు అప్పులు ప్రైవేటు అప్పులు వాటికి వడ్డీలు అన్నిటిని కలుపుకొని మొత్తం ఖర్చుల పైన 50 శాతం రైతుకు లాభం వచ్చేటట్లు రైతు పంటలకు ధర ఇవ్వాలని స్వామినాథన్ సిఫారసులు చెబుతున్నాయని దాని ప్రకారం రైతుకు ఒక క్వింటాలుకు రూ 4000 లు అయినా ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి తావాసిల్దారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సాలూర మండల పరిధిలో రైతాంగం అధిక శాతం మొక్కజొన్నను కూడా వేశారని మొక్కజొన్న కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం ఎల్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ సాలుర మండల రైతులు ఇల్తేపు గంగారం ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు జి. దేవయ్య సిహెచ్.రమేష్ గంగారాం సుధాకర్ రాజు మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.