శ్రీనిక్ పుట్టినరోజు వేళ.. అనాథ చిన్నారులకు అన్నదానం

* పుట్టినరోజున సేవా గుణం చాటుకున్న భీమగళ్ల శ్రీనిక్ కుటుంబం * జడ్చర్ల 'అనురాగిని' ఆశ్రమంలో ఘనంగా శ్రీనిక్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: తమ కుమారుడి పుట్టినరోజును ఆడంబరాలకు పోకుండా, అనాధ చిన్నారుల మధ్య జరుపుకొని ఓ కుటుంబం తమ ఉదారతను చాటుకుంది .వివరాల్లోకి వెళితే రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన కీ “శే ” . భీమగళ్ల రాములు కుమారుడు భీమగళ్ల శివ కుమార్ , భార్య భూమిక పెద్ద కుమారుడు శ్రీనిక్ జన్మదినం సందర్భంగా సోమవారం జడ్చర్లలోని ‘అనురాగిని’ స్వచ్ఛంద సేవా సంస్థలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.శ్రీనిక్ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అనురాగిని ట్రస్ట్ సిబ్బంది, పిల్లల సమక్షంలో శ్రీనిక్ చేత కేక్ కట్ చేయించి ఆశ్రమ పిల్లలకు కడుపునిండా భోజనం వడ్డించారు. చిన్నారుల చిరునవ్వుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని శ్రీనిక్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ట్రస్ట్ వారు శివకుమార్ దంపతులకు చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భీమగళ్ల మల్లేష్, యాదమ్మ, రాజు, సంధ్య ,కళా శేఖర్ తో పాటు ట్రస్ట్ ప్రతినిధులు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *