
పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 14 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణంలోని కొంతమంది నిరుపేద వృద్ధులకు,బిక్షాటన చేసేవారికి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు సభ్యులు పెండ్యాల రాజు ఆధ్వర్యంలో భోజనాల పోట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఉప్పులూరి పూర్ణసాయి చందర్రావు, సరస్వతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో నిరుపేద వృద్ధులకు భోజనం ప్యాకెట్లను అందజేయడం జరిగిందని మానవసేవే మాధవసేవ అన్నారు.ఈ కార్యక్రమంలో వాతాడ డేవిడ్ రాజ్, సేనాధిపతి రాజు, పెండ్యాల రాజ్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్,బుజ్జి బాబు,ఎస్కే షారుక్,ఆకుల శంకర్, బషీర్ లు పాల్గొన్నారు.