శ్రీ స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన హెచ్ఎం.నక్క. బాబురావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 15 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారము నాడు అంబేద్కర్ జయంతి వేడుకలు హెచ్ఎం నక్కా బాబురావు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలను మరిచిపోలేమని అన్నారు. వివిధ వ్యవస్థల పనితీరును , నియంత్రణను, ముందుగానే అంచనా వేసి పౌర హక్కులు , విధులు బాధ్యతలు రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అని తెలిపారు. పాఠశాల చుట్టుపక్కల వారిని కూడా పిలిచి కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయటం విశేషం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేగినేటి వెంకటరమణ ,స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *