రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సొసైటీ వెల్ఫేర్ సభ్యులు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన భద్రాద్రి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎడారి రమేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభ్యులందరూ అంబేద్కర్ ఆశయాలపై కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు సెనగ మల్లేష్ మాట్లాడుతూ“అంబేద్కర్ ఇచ్చిన సమాన అవకాశాలు దేశానికి మూలస్తంభం. మీడియా వార్తల్లో సమానత్వం, సామాజిక న్యాయం ప్రతిఫలించాలి. కుల, మత భేదాలు లేకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి మీడియా ముందుండాలి” అని స్పష్టం చేశారు.కోశాధికారి బిట్ర సాయిబాబా మాట్లాడుతూ అంబేద్కర్ పోరాటం అణగారిన వర్గాలకు మార్గదర్శకం.పేదరికం, విద్యా లోపం వంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం.మీడియా సభ్యులకు సంఘం పూర్తి మద్దతు అందిస్తుంది” అని తెలిపారు. సిపిఎం నాయకుడు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలం సమానత్వానికి ప్రతీక. సామాజిక, ఆర్థిక అసమానతల నిర్మూలనకు ఐక్యత అవసరం.మీడియా ప్రజల స్వరం కావాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎడారి రమేష్,ఉపాధక్షులు సెనగ మల్లేష్, కార్యదర్శి రవినాథ్, కోశాధికారి బిట్ర సాయిబాబా ,ప్రభాకర్, , సతీష్, రాజశేఖర్, శివరామ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *