పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 16.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మహనీయుడు దళిత పీడిత జనోధరుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని స్థానిక మండల పరిపాలన భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సమసమాజ స్థాపనకు అహర్నిశలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి చేశారని గుర్తు చేశారు రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించి ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం జై భీమ్ నినాదంతో మండల పరిపాలన భవనం మారుమోగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు