చేగుంటలో ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

పయానించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన వివిధ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో చిన్నారెడ్డి, తాసిల్దార్ శివప్రసాద్,పార్టీ నాయకులు ఉపాధ్యాయ సంఘాలు అంబేద్కర్ సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివారని, ‘శూద్రులు ఎవరు ‘అనే పుస్తకంలో ఆర్య, ద్రవిడ సిద్ధాంతాన్ని పూర్తి గా తిరస్కరించారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర భారతదేశపు మొదటి నా శాఖ మంత్రిగా పనిచేశారు. అని , హిందూమతంలోని బడుగు, బలహీనవర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు విష్ణు, ఉపాధ్యక్షులు ఎర్ర యాదగిరి అంబేద్కర్ సంగం నాయకులు ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *