పెద్ద శంకరంపేట లో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) పెద్ద శంకరంపేట్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం 24 మంది సి.ఎం.ఆర్.ఎఫ్ లబ్ధిదారులకు 11 లక్షల విలువ గల చెక్కులు 93 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 9,31,788 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు మండలంలోని నిరుపేద కుటుంబాలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజలు పాల్గొన్నారు. అలాగే శంకరంపేట్ మండల లోని శివాయ పల్లి గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డి ఆర్ డి ఏ- ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర గ్రేడ్-ఏ రకం: క్వింటాలుకు రూ. 2389/- సాధారణ రకం: క్వింటాలుకు రూ. 2369/- రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూ డాలని తూకంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యాన్ని శుభ్రం చేసుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఐకేపీ అధికారులు, గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *