
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14 ,బూర్గంపాడు మండలం రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామ తాళ్ల గొమ్మూరు గ్రామ పంచాయతీకి చెందిన గోవిందు యశ్విత, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 992 మార్కులు మరియు కేసుగాని సతీష్ కుమార్ ఎంపీసీ విభాగం లో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి భద్రాచలం లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కళాశాలలో జయ కేతనం ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా తాళ్లగొమ్మూరు ఈవో మురళి, సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ బేబీ గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు కలిసి చిరు సన్మానం చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన పిల్లలు ఇలాంటి ఫలితాలు సాధించడం మాకు మా గ్రామానికి చాలా సంతోషంగా ఉందని ముందు ముందు మరెన్నో ర్యాంకులు సాధించి ,గ్రామపంచాయతీ పేరును, వారి తల్లిదండ్రుల పేరును నిలబెడతారని తమ సంతోషాన్ని తెలియజేశారు. అదేవిధంగా కళాశాల యాజమాన్యం యస్విత, సతీష్ కుమార్ లను అభినందించారు.యస్విత తల్లిదండ్రులు గోవిందు వెంకటేశ్వర్లు, అనుష , సతీశ్ కుమారు తల్లితండ్రులు కేసుగాని శ్రీనివాస్ గౌడ్, శైలజ మాట్లాడుతూ తమ పిల్లల కళాశాలలో మెరుగైన మార్కులు సాధించడం మాకు ఎంతో గర్వంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.