జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 16.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జే.. నాగరాజ) మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలదార జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాగతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *