సైబరాబాద్ సీపీ సర్ రోడ్డు భద్రతప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ బుధవారం రోజు కోతగూడలోని కే ఎల్ హెచ్ యూనివర్సిటీలో “రైవ్ అలివ్” రోడ్డు భద్రత కార్యక్రమం భాగంగా ట్రాఫిక్ అధికారులతో కలిసి విద్యార్థులతో అవ గాహన సమావేశం నిర్వహించబడింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ సర్ ఈ కార్యక్రమంలో పాల్గొని,విద్యార్థు లతో మాట్లాడి రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను రోడ్డు ప్రమాదాలపై వారి అనుభవాలను పంచుకోవాలని, తమకు లేదా వారి కుటుంబ సభ్యులకు ప్రమాదాలు ఎదురైన సందర్భాలు వాటి ప్రభావా లను వివరించాలని కోరారు. అలాగే, సీపీ సర్ సైబర్ టవర్ లు వద్ద నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ శేరిలింగంపల్లి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్, ఏసీపీ మాధాపూర్ (ఎల్ అండ్ ఓ) ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *