దుమ్ము దూళి సమస్యను వెంటనే పరిష్కరించాలి

ఉట్నూర్ సర్పంచ్ అనితకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్వీ నాయకులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూరులోని పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఎగసిపడుతున్న దుమ్ము దూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారు సర్పంచ్ అనితకు వినతిపత్రం అందజేశారు జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ మాట్లాడుతూ.. దుమ్ము దూళి వల్ల స్థానిక ప్రజలు వ్యాపారులు మరియు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు రోజుకు కనీసం మూడుసార్లు రోడ్డు పై నీటిని చల్లి దుమ్ము నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో షకత్ అలీ రాజ్ కుమార్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *