కురువ-కురుమల అభ్యున్నత కోసం కృషి చేస్తా.

కురుబలు రాజకీయంగా ఎదగాలoటే టిడిపితోనే అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ రాష్ట్రంలో ఉన్న కురుమ,కురుబ కురువల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె లో రాష్ట్ర కురుబ సంఘం నూతనంగా ఎన్నికైన వారి సన్మాన సభ నిర్వహించారు. ఈ సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తో పాటు స్థానిక ఎమ్మెల్యే షాజహన్ భాష, మరియు నూతనంగా ఎన్నికైన కురుబ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె మల్లికార్జున హాజరయ్యారు. ఈ సమావేశం కురుబ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బల్లె రెడ్డిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఎమ్మెల్యే షాజహాన్ భాషతో పాటు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కురుబల కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ మదనపల్లిలో తన గెలుపు కోసం కృషిచేసిన కురుబలకు ఎప్పుడు కూడా తాను అండగా నిలుస్తానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కురుబలకు ప్రత్యేక స్థానాలు కేటాయిస్తానని ఈ సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర కురుబ- కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కురుబలు ఆర్థికంగా, విద్య పరంగా, రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడే కురుబలు అన్ని రంగాలలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కుల సంఘాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే రాజకీయాల్లో పైకి రావడం చాలా సులువు అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కురుబలను గుర్తించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కులానికి పెద్దపీట వేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. కురుబలు అన్ని విధాలుగా ఎదగాలంటే అది టి డి పి తోనే సాధ్యమని, కురుబ కులస్థలంతా కూడా టిడిపికి కలిసి కట్టుగా రావాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కురుబలు ఒక తాటిపైకి వచ్చి కురుబ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికులుగా కృషి చేయాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కురుబాలను గుర్తించినందుకే మొదటిసారిగా ఎమ్మెల్యే గా గెలిచినకులముద్దుబిడ్డ .సవితమ్మ అక్కకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం, అలాగే మారుమూల గ్రామం నుండి వచ్చిన తనకు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ పదవి చంద్రబాబు నాయుడు ఇవ్వడం కురుబల పై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ కూడా తమకు ఎంతో అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారని, కావున ప్రతి ఒక్కరు కూడా టిడిపి పార్టీకి రుణపడి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు గౌని లక్ష్మన్న, కాంతారావు, రఘునాథ్, కప్పల శ్రీరాములు, సదాశివ, గూడే శ్రీనివాసులు, ఆవుల కిష్టయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *